బంధానికి బ్రేకులు వేసిన యుద్ధం
NEWS Oct 10,2024 04:21 am
అమెరికాలో రతన్ టాటా ఉద్యోగం చేస్తున్నప్పుడు ప్రేమలో పడ్డారు. ప్రియురాలు తన కోసం భారత్ వస్తుందని ఆయన భావించారు. అయితే, అదే సమయంలో అంటే 1962లో భారత్-చైనా మధ్య యుద్ధం జరుగుతోంది. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆమెను ఇండియా పంపేందుకు అంగీకరించలేదు. దీంతో వారి బంధానికి బ్రేకులు పడింది. ఆ తర్వాత రతన్ టాటాపై టాటా గ్రూపును నడిపించాల్సిన బాధ్యత పడింది. ఈ క్రమంలోనే ఆయన టాటా గ్రూపును అత్యున్నత శిఖరాలకు చేర్చారు. ఈ క్రమంలో ఆయన తీరిక లేకుండా గడపడంతో వివాహం చేసుకోలేకపోయానని రతన్ టాటా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు.