మోదీ నాకు మంచి మిత్రుడు: ట్రంప్
NEWS Oct 09,2024 05:10 pm
అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. మోదీ తనకు మంచి మిత్రుడు అని, మంచి మనిషి అని కితాబునిచ్చారు. చాలా గొప్పవాడు అన్నారు. ఆయన ప్రధాని కావడం కంటే ముందు భారత్ అస్థిరంగా ఉండేదన్నారు. 2019లో హౌడీ, మోదీ కార్యక్రమానికి మంచి ఆదరణ లభించిందని గుర్తు చేసుకున్నారు. మోదీతో పలుమార్లు వేదికను పంచుకున్నట్లు చెప్పారు. ఎవరైనా భారత్ పట్ల బెదిరించిన ధోరణితో మాట్లాడితే మోదీలో స్పష్టమైన మార్పు కనిపిస్తుందన్నారు.