హైదరాబాద్‌లో MRPS అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పూర్తి చేయకుండానే ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా భర్తీ చేస్తారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో భారీ ఎత్తున ర్యాలీలు, ధర్నాలు నిర్వహించాలని.. MRPS పిలుపునిచ్చింది. ఎస్సీ వర్గీకరణ అమలు చేసే వరకు.. మాదిగల వాటా తేలే వరకు ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు జరపొద్దని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.