సారంగాపూర్: సారంగాపూర్ మండలంలోని కోనాపూర్ గ్రామంలో నవదుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం రోజున సరస్వతీ మాత రూపంలో దుర్గామాత భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు.