సీఎం రేవంత్‌ను కలిసిన మల్లారెడ్డి
NEWS Oct 09,2024 08:06 am
సీఎం రేవంత్‌రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కలిశారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంకు వెళ్లిన మల్లారెడ్డి.. తన మనమరాలి వెడ్డింగ్ కార్డుని రేవంత్‌కి అందజేశారు. వివాహ వేడుకకు హాజరుకావాలని ఆహ్వానించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో మల్లారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలవడం ఆసక్తికరంగా మారింది. గతంలో రేవంత్ రెడ్డి, మల్లారెడ్డి మధ్య మాటల తూటాలు పేలాయి.