ఏకంగా SP ఫోన్ లోకేషన్‌నే పోలీస్ అధికారులు ట్రాక్ చేశారు. SP లోకేషన్ ట్రాకింగ్ పాల్పడ్డారు. రాజస్థాన్ లోని భీవాండీలో ఎస్పీ జ్యేష్ఠ మైత్రేయి లోకేషన్ ట్రాక్ చేసిన ఘటనలో సైబర్ సెల్ సబ్ ఇన్ స్పెక్టర్ తో సహా 7 గురు అధికారులను సస్పెండ్ చేశారు. అయితే ఎవరు SP లోకేషన్ ట్రాక్ చేయమన్నారు.. ఎందుకు చేయమన్నారు అనే విషయాలు తెలియాల్సి ఉంది. అక్టోబర్ 6న SPజ్యేష్ఠ మైత్రేయి మొబైల్ ఫోన్ ను ట్రాక్ చేస్తున్నట్లు గుర్తించారు. గత కొన్ని వారాలుగా ఆమె ఫోన్ ట్రాక్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.