దుర్గమ్మను దర్శించుకున్న పవన్ కళ్యాణ్..!
NEWS Oct 09,2024 06:27 am
ఇంద్రకీలాద్రిపై సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న కనకదుర్గమ్మను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన కుమార్తె ఆద్యతో కలిసి దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయ అధికారులు పవన్‌కు స్వాగతం పలికారు. అనంతరం తీర్థప్రసాదాలు, అమ్మవారి చిత్ర పటం అందజేశారు. పవన్‌తో పాటు హోంమంత్రి అనిత, ఎంపీ కేశినేని శివనాథ్ అమ్మవారిని దర్శించుకున్నారు.