జంబి గద్దె వద్ద పారిశుద్ధ్య పనులు
NEWS Oct 09,2024 05:18 am
వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో ఉన్న జంబి గద్దె పరిసరాల్లో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు మెట్‌పల్లి మున్సిపల్ కమిషనర్ టి మోహన్. కమిషనర్ మాట్లాడుతూ.. వచ్చే దసరా పండుగ పురస్కరించుకొని ముందస్తుగా జంబిగద్దే పరిసరాను శుభ్రం చేస్తామని, చెన్నకేశవ ఆలయ సమీపంలో ఉన్న మైసమ్మల వద్ద క్లీనింగ్ చేయాలని మున్సిపల్ సిబ్బందికి ఆదేశించామని తెలిపారు. దసరా పండుగ రోజు వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో పరిసరాల్లో లైట్లు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు.