క్రీడలపై ఆసక్తి, నైపుణ్యం పెంచేలా ప్రణాళికలు.
NEWS Oct 08,2024 05:52 pm
యువతకు క్రీడలపై ఆసక్తి,నైపుణ్యం పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తున్నదని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. యువతను ప్రేరేపించి, క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్చ్ రిలే రాలీని ప్రారంభించగా మంగళవారం సిరిసిల్లకు చెరుకుంది. ఆది శ్రీనివాస్ సిరిసిల్లలో టార్చ్ రిలే రాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా,ఎస్పీ అఖిల్ మహాజన్ మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా,జిల్లాయువజన క్రీడల శాఖ అధికారి ఎ.రాందాస్ పాల్గొన్నారు.