రాయపోల్ మండలం వడ్డేపల్లి శివారులోని అటవీ ప్రాంతంలో పులి సంచారం నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు గుర్తించారు. అటవీ అధికారులు నిర్ధారించడంతో పులిజాడ తెలుసుకొనేందుకు ట్రాఫ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. కులాల వద్దకు వెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ దండోరా వేయించారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్ జహంగీర్ రైతులతో మాట్లాడి జాగ్రత్తలు వివరించారు.