అనంతపురం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం బుక్కరాయసముద్రం మండల ప్రజా పరిషత్ కార్యాలయం సభా ప్రాంగణంలో మహిళల న్యాయ విజ్ఞాన సదస్సు విధాన్ సే సమాధాన్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి శివప్రసాద్ యాదవ్ అధ్యక్షతన వహించారు. సందర్భంగా.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జాతీయ న్యాయ సేవ ప్రాధికార సంస్థ పథకాలను వివరించారు.