నెత్తురోడిన పచ్చని అడవి..
NEWS Oct 05,2024 06:28 am
ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో దండకారణ్యం తుపాకీ మోతలతో దద్దరిల్లింది. నారాయణ్ పూర్ – దంతెవాడ జిల్లా సరిహద్దుల్లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి భారీ ఎదురుకాల్పుల్లో మావోల మృతుల సంఖ్య పెరుగుతోంది. ఎన్‌కౌంటర్‌లో 40మందికిపైగా మావోయిస్టులు మరణించినట్లు తెలుస్తోంది. మృతుల్లో మావోయిస్టు పార్టీ దండకారణ్యం రాష్ట్ర కమిటీ సభ్యుడు, విజయవాడకు చెందిన జోరిగె నాగరాజు అలియాస్ రామకృష్ణ అలియాస్ కమలేశ్ అలియాస్ విష్ణు ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అతనితోపాటు మరికొందరు మావోయిస్టు కీలక సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది.