ప్రతి ఫ్యామిలీకి ఓ QR కోడ్
NEWS Oct 05,2024 06:14 am
ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ప్రత్యేకంగా ప్రతి ఫ్యామిలీకి ఓ QR కోడ్ ఉంటుంది. ఆధార్ కార్డు తరహాలో ఆ కుటుంబంలోని సభ్యులకు ఒక్కొక్కరికి విడివిడిగాను స్పెషల్ నెంబర్ కేటాయిస్తారు. రేషన్, ఆరోగ్యశ్రీ వంటి వేర్వేరు కార్డులన్నింటికీ ఒకటే కార్డు తీసుకొచ్చేందుకు వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డ్ విధానంతో ఈ డిజిటల్ కార్డులు తీసుకొస్తున్నారు. ఈ కార్డులో రేషన్, మహాలక్ష్మి పథకాల లబ్ధిదారులను అనుసంధానం చేస్తారు. కుటుంబం మెుత్తం (మహిళలు) ఒక్క కార్డుతోనే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయచ్చు. భవిష్యత్‌లో ఏదైనా పథకం కోసం అఫ్లయ్ చేయాల్సి వస్తే డిజిటల్ కార్డులోని ఆ ఫ్యామిలీ మెంబర్ యూనిక్ సంఖ్యను నమోదు చేస్తే సరిపోతుంది.