ఖతర్‌లో జువ్వాడి జయంతి వేడుకలు
NEWS Oct 05,2024 05:46 am
కోరుట్ల పట్టణంలో వెటర్నరీ యూనివర్శిటీ ముందు దివంగత కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి జువ్వాడి స్మారక విగ్రహము ఏర్పాటు చేయడంపై ఖతర్‌లో ఉంటున్న వెంకటాపూర్ గ్రామానికి చెందిన జువ్వాడి అభిమాని ముహమ్మద్ నసీర్ ఆనందం వ్యక్తం చేశారు. జువ్వాడి ప్రజల మనసుల్లో ఎప్పటికీ నిలిచే ఉంటారని అన్నారు. ఈమేరకు ఖతర్‌లో జువ్వాడి రత్నాకర్ రావు 97వ జయంతి వేడుకలు జరిపారు.