రాజేంద్రప్రసాద్ ఇంట తీవ్ర విషాదం
NEWS Oct 05,2024 05:35 am
సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట విషాదం నెలకొంది. ఆయన కుమార్తె గాయత్రి(38 ) గుండెపోటుతో మృతి చెందారు. గాయత్రి నిన్న కార్డియాక్ అరెస్ట్ కు గురవ్వగా హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. రాజేంద్రప్రసాద్ కు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు మృతి చెందడంతో ఆయన కన్నీరుమున్నీరవుతున్నారు. ఆయన కూతురు మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.