దసరా పండగకు జిల్లాలో ప్రత్యేక బస్సులు
NEWS Oct 05,2024 05:46 am
దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఉమ్మడి మెదక్ రీజియన్ పరిధిలో 542 ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపేందుకు సమాయత్తమైంది. సంగారెడ్డి రీజియన్ పరిధిలోని 8 డిపోల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు సంగారెడ్డి ఆర్ఎం ప్రభులత తెలిపారు. ఆర్టీసీ చెందిన 334 సర్వీసులు, హైర్ బస్సులు 208 నడుపుతున్నామన్నారు. రద్దీ ఉంటే మరిన్ని నడుపుతామన్నారు.