కోరుట్ల ఎస్సై శ్వేత సస్పెన్షన్
NEWS Oct 05,2024 04:50 am
కోరుట్ల పోలీస్ స్టేషన్ లో ఎస్సై2 గా పనిచేస్తున్న శ్వేతను సస్పెండ్ చేస్తూ మల్టిజోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కుటుంబ కలహాలతో కవిత అనే మహిళ కోరుట్ల పోలీసులను ఆశ్రయించగా ఆమె భర్త శివప్రసాద్ ను కౌన్సిలింగ్ కు పిలిచి దుర్భాషలాడుతూ ఎస్సై శ్వేత చేయి చేసుకోగా.. మనస్థాపం చెంది పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందాడు. దీంతో ఎస్సై శ్వేతను జిల్లా కార్యాలయానికి అటాచ్ చేసి శాఖాపరమైన విచారణ అనంతరం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.