అన్నపూర్ణాదేవి అవతారంలో అమ్మవారు
NEWS Oct 05,2024 04:57 am
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్ గ్రామంలో దేవి శరన్నవరాత్రు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శనివారం దుర్గామాత దేవాలయంలో అమ్మవారికి శరన్నవరాత్రు ఉత్సవాల సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 3వ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనం కల్పించారు. 9 రోజులపాటు అమ్మవారికి ఉదయం సాయంకాల వేళలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయనిర్వాహకులు తెలిపారు.