మానవత్వాన్ని చాటుకున్నా ఎంఈఓ ప్రభు
NEWS Oct 05,2024 05:00 am
భద్రాద్రి జిల్లాలో డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ స్థానిక సింగరేణి హై స్కూల్ నందు నిర్వహిస్తున్నారు. ఈ నేపధ్యంలో కొత్తగూడెం ఎంఈఓ డా.ఎం ప్రభు దయాల్ మానవత్వాన్ని చాటుకున్నారు. గుండాల మండలం నుంచి ఈసం విజయనిర్మల డెంగ్యూ వ్యాధితో తీవ్ర అనారోగ్య పరిస్థితికి గురై, బంధువుల సాయంతో సర్టిఫికెట్ల పరిశీలనకు కేంద్రానికి వచ్చారు. ఆమె పరిస్థితిని గమనించిన ఎంఈఓ జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర చారి దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక సదుపాయాలు కల్పించి సర్టిఫికెట్ల పరిశీలన చేశారు.