ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలి
NEWS Oct 04,2024 05:24 pm
జిల్లాలో అత్యధికంగా ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి, ప్రమాదాలు జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం రోడ్డు భద్రతా సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు అవగాహన కల్పించేందుకు రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా వర్క్ షాప్లు నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రూపేష్, అధికారులు పాల్గొన్నారు.