CMRF పేదలకు వరంలాంటిది: ఎమ్మెల్యే
NEWS Oct 04,2024 04:51 pm
సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం లాంటిదని నారాయణఖేడ్ నియోజకవర్గం ఎమ్మెల్యే పటోళ్ల సంజీవరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన చెట్టుకింద యాదయ్య అనే వ్యక్తికీ రూ.27,500 గల సీఎం సహాయక నిధి చెక్కును శుక్రవారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం నిరుపేదల కోసం పనిచేసే ప్రభుత్వమని సీఎంఆర్ఎఫ్ సహాయక నిది పేదలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.