శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రబాబు దంపతులు
NEWS Oct 04,2024 04:47 pm
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి సీఎం చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకుముందు బేడీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి సతీసమేతంగా పట్టు వస్త్రాలు తీసుకుని వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈఓ శ్యామలరావు తదితరులు ఉన్నారు.