ఎస్సీ వర్గీకరణ తీర్పును అమలుపరచాలి
NEWS Oct 04,2024 04:32 pm
సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పుకు వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఎంఎస్ పి, ఎం ఆర్ పి ఎస్ నాయకులు అన్నారు. సిరిసిల్లలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ ప్రకారం ఉద్యోగ నియామకాలు చేపడతామని ప్రస్తుత నోటిఫికేషన్లకు కూడా వాటిని వర్తింప చేస్తామని, అసెంబ్లీలో హామీ ఇచ్చి ఇప్పటి వరకు కూడా అమలులోకి తీసుకురాలేదన్నారు.