ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాలు
NEWS Oct 04,2024 04:31 pm
సిరిసిల్ల పట్టణంలోని నెహ్రూ నగర్ కనకదుర్గ అంబా భవాని ఆలయంలో అంగరంగ వైభవంగా దేవి నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఆలయ ప్రధాన అర్చకులు బోల్లి శ్రీధర్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారి కృపతో అందరూ చల్లగా ఉండాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గుండ్ల పెల్లి రామానుజం, ఆలయ అధ్యక్షులు చిలక నారాయణ, కార్యదర్శి గాజుల భాస్కర్, జక్కని సత్యనారాయణ, గుండ్లపల్లి గౌతం, వెల్ది చక్రపాణి, బూర బాబి, పొలు నారాయణ, భక్తులు పాల్గొన్నారు.