వ్యభిచార గృహంపై దాడి చేసిన పోలీసులు
NEWS Oct 04,2024 03:44 pm
సిద్దిపేట పట్టణం శివాజీ నగర్ లో ఓ ఇంట్లో వ్యభిచచారం నడిపిస్తున్నారని పక్క సమాచారంతో సిద్దిపేట టాస్క్ ఫోర్స్, వన్ టౌన్ పోలీసులు శుక్రవారం దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు విటులు, ఓ మహిళను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2 వేల నగదు, 6 సెల్ ఫోన్స్, ఓ మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వన్ టౌన్ పోలీసులు తెలిపారు.