SGF అండర్ 19 క్రీడ పోటీలు ప్రారంభం
NEWS Oct 04,2024 03:42 pm
ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి SGF అండర్ 19 క్రీడా పోటీలను శుక్రవారం జగిత్యాలలోని ఓ ఫంక్షన్ హాల్లో ప్రారంభించారు DEO వెంకటేశ్వర్లు. ఈ సందర్బంగా DEO మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోను రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ కళాశాలల నుండి 150 మంది క్రీడాకారులు హాజరయ్యారని, ఇందులో సెలక్ట్ అయిన విద్యార్థులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయటం జరుగుతుందన్నారు.