జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి బదిలీ
NEWS Oct 04,2024 03:40 pm
జగిత్యాల జిల్లా వ్యవసాయ అధికారిణి వాణిశ్రీ ని రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ కార్యాలయానికి బదిలీ అయ్యారు. కొన్ని రోజులుగా నిబంధనల పేరుతో ఫెర్టిలైజర్స్, సహకార సంఘ చైర్మన్ల వద్ద వసూళ్లకు పాల్పడుతూ.. వేధింపులకు గురి చేస్తోందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు పలువురు ఫిర్యాదు చేయగా సీరియస్ గా తీసుకున్న విప్ వ్యవసాయ శాఖమంత్రికి ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు బదిలీ చేస్తూ ఇంచార్జ్ గా రాంచంద్రంకు బాధ్యతలు అప్పగించారు.