సదాశివపేటలో పర్యటించిన కలెక్టర్
NEWS Oct 04,2024 03:39 pm
సదాశివపేట పట్టణం 26 వార్డులో డిజిటల్ సర్వే పనులను జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పైలెట్ ప్రాజెక్టు కింద పురపాలక సంఘంలోని 26 వార్డును ఎంపిక చేశామన్నారు. సర్వే సిబ్బంది ప్రతీ ఇంటికి వెళ్ళి వివరాలను నమోదు చేయాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.