రుణమాఫీ, రైతు భరోసా,500 రూపాయల బోనస్ విషయంలో కాంగ్రెస్ సర్కారు హామీ ఇచ్చి అన్నదాతలను మోసం చేసిందని వేలాది రైతులు జగిత్యాల కలెక్టరేట్ ను ముట్టడించారు. కలెక్టరేట్ కు ర్యాలీగా బయలుదేరిన రైతులు మార్గమధ్యంలో కొత్త బస్టాండ్ వద్ద పడుకొని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టరేట్ వద్ద దాదాపు 2 గంటలకు పైగా బైఠాయించగా కలెక్టర్ స్వయంగా వచ్చి ప్రభుత్వానికి రైతుల సమస్యలు నివేదిస్తానని పేర్కొనడంతో రైతులు నిరసన విరమించారు. ఈసందర్భంగా అడుగడుగునా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.