రొళ్లలో పిచ్చి మొక్కలు తిని మేకల మృతి
NEWS Oct 04,2024 03:37 pm
రొళ్ల మండలం ఎం.రాయపురం గ్రామపంచాయతీ హున్షేకుంట గ్రామంలో శుక్రవారం 10 మేకలు మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. హున్షేకుంట గ్రామానికి చెందిన గోవిందప్ప, రవికుమార్, రాజన్నలకు చెందిన మేకలను రోజులాగే మేతకు తీసుకెళ్లారు. మేకలు మేస్తూ మేస్తూ పిచ్చి మొక్కలు తిని మృతి చెందినట్లు బాధితులు తెలిపారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని బాధితులు కోరారు.