ఆంధ్రప్రదేశ్‌లో స్విగ్గీ బాయ్‌కాట్
NEWS Oct 04,2024 01:45 pm
ఆంధ్రప్రదేశ్‌లో స్విగ్గీని బహిష్కరించాలని హోటళ్ల యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి. నగదు చెల్లింపులు చేయకుండా ఇబ్బంది పెడుతున్న స్విగ్గీపై హోటల్, రెస్టరంట్ యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. స్విగ్గీకి ఈ నెల 14 నుంచి అమ్మకాలు నిలిపివేయాలని అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. జొమాటో మాత్రమే మాత్రమే తమ అభ్యంతరాలను అంగీకరించిందని హోటల్స్ అసోసియేషన్ నాయకులు తెలిపారు.