కొండగట్టులో మహిళా శక్తి క్యాంటీన్
NEWS Oct 04,2024 01:28 pm
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన మహిళా శక్తి క్యాంటీన్‌ను శుక్రవారం మల్యాల మండలంలోని కొండగట్టు దిగువ ప్రాంతంలో చొప్పదండి MLA మేడిపల్లి సత్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను అన్ని రంగాల్లో అగ్రగ్రామిగా ఉంచుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆనందరెడ్డి, దారం ఆదిరెడ్డి, ముత్యపు శంకర్, నల్లపు మల్లేశం, మహిళలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.