క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన MLA
NEWS Oct 04,2024 12:57 pm
మల్యాల మండల కేంద్రంలోని X-రోడ్ వద్ద MS వారియర్స్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ సీజన్-1 ను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి చొప్పదండి MLA మేడిపల్లి సత్యం ప్రారంభించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ తో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం MLA మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ కు అత్యంత చొరవ చూపి యువకులను ప్రోత్సహించిన మల్యాల ఎస్సై నరేష్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆనందరెడ్డి, ఆదిరెడ్డి, శ్రీనివాస్, రామ్మోహన్ రావు తదితరుల పాల్గొన్నారు.