చీటింగ్ చేసిన ముగ్గురు వ్యక్తులపై కేసు
NEWS Oct 04,2024 12:20 pm
సిరిసిల్ల జిల్లా: ఇల్లంతకుంట మండల కేంద్రంలో న్యూట్రీషన్ ప్రొడక్ట్స్ కొనుగోలు చేసి అమ్మితే లాభాలు వస్తాయంటూ ముగ్గురు వ్యక్తుల వద్ద 9 లక్షలు వసూలు చేసి చీటింగ్ చేసిన ఇద్దరు వ్యక్తులపై, ఏజెంట్లపై కేసు నమోదు చేసినట్టు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఓ ప్రకటన తెలిపారు. జిల్లాలో గొలుసు కట్టు స్కీమ్స్ పేరుతో ప్రొడక్ట్స్ కొనుగోలు చేసి అమ్మితే అధిక లాభాలు వస్తాయంటూ మోసాలకు పాల్పడే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ హెచ్చరించారు.