మెరుగైన వైద్య సేవలు అందించాలి
NEWS Oct 04,2024 12:12 pm
జగిత్యాల: రోగులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా స్పెషల్ ఆఫీసర్ ఆర్‌వి కర్ణన్ తెలిపారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని మాత శిశు కేంద్రాన్ని కలెక్టర్ బి, సత్య ప్రసాద్‌తో కలసి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. డిజిటల్ ఫ్యామిలీ సర్వేలో భాగంగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, రూరల్ మండలం అంతర్గాం ఓడ్డెర కాలనీ సర్వేలో పాల్గొన్నారు.