ఫ్యామిలీ డిజిటల్ సర్వే పరిశీలన
NEWS Oct 04,2024 12:19 pm
ఫ్యామిలీ డీటెయిల్స్ సర్వే వివరాలు పకడ్బందీగా సేకరించాలని జిల్లా ప్రత్యేక అధికారి, వైద్య కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ డైరెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు.సిరిసిల్ల జిల్లా కేంద్రం మున్సిపల్ 5వ వార్డులో కొనసాగుతున్న ఫ్యామిలీ డిజిటల్ సర్వేను ఆర్వీ కర్ణన్ శనివారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వేలో భాగంగా అధికారులు, సిబ్బంది సేకరిస్తున్న వివరాలు, పత్రాలు పరిశీలించి, పలువురు స్థానికులతో మాట్లాడారు. మరణ వివరాలు అప్డేట్ చేయాలని సూచించారు. ఫోటోలు తీసుకోవాలని ఆదేశించారు.