డిజిటల్ హెల్త్ కార్డుల సర్వేలో కలెక్టర్
NEWS Oct 04,2024 12:07 pm
కోరుట్ల: తెలంగాణ డిజిటల్ హెల్త్ కార్డులు సర్వేలో భాగంగా కోరుట్ల మండలం సర్పరాజుపల్లి గ్రామంలో కలెక్టర్ సత్య ప్రసాద్ ఇంటింటా సర్వేలో పాల్గొన్నారు. డిజిటల్ ఫ్యామిలీ హెల్త్ కార్డులకు కుటుంబ వివరాలు పక్కాగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్, తహసిల్దార్, యంపీడీఓ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.