బ్రహ్మచారిణి రూపంలో నవదుర్గ అమ్మవారు
NEWS Oct 04,2024 12:18 pm
జగిత్యాల పట్టణంలోని నవదుర్గా పీఠ క్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. రెండవ రోజు శుక్రవారం నవదుర్గ అమ్మవారు బ్రహ్మచారిణి రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. దుర్గా సప్తశతి పారాయణం పూలంగి సేవ మాతలచే సామూహిక కుంకుమార్చన చండి హవనం ప్రారంభించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. అలాగే భక్తులు, మహిళలు అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.