జిల్లా ప్రత్యేక అధికారి సందర్శన
NEWS Oct 04,2024 12:17 pm
సిరిసిల్ల జిల్లా: ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రత్యేక అధికారి, వైద్య కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ డైరెక్టర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా సివిల్ హాస్పిటల్ ను వైద్య కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ డైరెక్టర్ ఆర్వీ కర్ణన్ శుక్రవారం పరిశీలించేందుకు రాగా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా,అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ పుష్పగుచ్చం అందించి, స్వాగతం పలికారు. అనంతరం ఓపీ రిజిస్ట్రేషన్ కౌంటర్ ను పరిశీలించి, రోజూ ఎంత మంది వస్తున్నారో ఆరా తీశారు.