యూట్యూబ్ షార్ట్స్ ఇకపై 3 నిమిషాలు
NEWS Oct 04,2024 11:24 am
యూట్యూబ్ తన షార్ట్స్‌లో ఇకపై క్రియేటర్లు 3 నిమిషాల నిడివి గల వీడియోలను అప్లోడ్ చేసుకోవచ్చు. అక్టోబర్ 15 నుంచి ఈ మార్పు రానుంది. ఇప్పటి వరకు 60 సెకన్లలోపు వీడియోలను షార్ట్స్‌గా గుర్తించింది యూట్యూబ్. ఇక కొత్తగా టెంప్లేట్ అనే ఆప్షన్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా ట్రెండింగ్ వీడియోలను ‘రీమిక్స్ బటన్’ ద్వారా కొత్త వీడియోగా రీక్రియేట్ చేయొచ్చు. ట్రెండింగ్, పాపులర్ వీడియోలకు పర్సనల్ టచ్ ఇవ్వడంలో కంటెంట్ క్రియేటర్లకు ఈ ఫీచర్ ఉపయోగపడనుంది.