ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదు
NEWS Oct 04,2024 11:39 am
జగిత్యాల జిల్లా కేంద్రంలోని BRS పార్టీ కార్యాలయంలో BRS పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుణమాఫీ కాక రైతులు ప్రతి రోజు ధర్నాలు చేస్తున్న ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని విమర్శించారు. రుణమాఫీ విషయంలో పాలాభిషేకం చేసుకున్న నాయకులకు చిత్తశుద్ధి లేదన్నారు. ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గడుస్తున్న ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు.