ఫ్యామిలీ డిజిటల్ కార్డుల ఇంటింటి సర్వే
NEWS Oct 04,2024 11:29 am
జోగిపేట: డిజిటల్ కార్డుల సర్వే కోసం జోగిపేట పురపాలక సంఘం పరిదిలో పైలట్ ప్రాజెక్టుగా 17 వ వార్డును ఎన్నుకున్నారు. అందులో భాగంగా జిల్లా కలెక్టర్ రెండు టీం లను ఏర్పాటు చేసి, నోడల్ ఆఫీసర్ గా RDOని నియమించారు. రెండు టీంలు 17 వ వార్డులో ఫ్యామిలీ బేస్ డేటా ఆధారంగా ఇంటింటి సర్వే వార్డు కౌన్సిలర్ ఆకుల సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో RDO పాండు, PD MEPMA గీత, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.