జువ్వాడి విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి
NEWS Oct 04,2024 10:54 am
కోరుట్ల: కాంగ్రెస్ పార్టీకి, కోరుట్ల నియోజకవర్గ అభివృద్ధికి మాజీ మంత్రి స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు ఎనలేని కృషి చేశారని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కొనియాడారు. కోరుట్ల పట్టణంలో ఏర్పాటు చేసిన మాజీ మంత్రి స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు కాంస్య విగ్రహాన్ని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక నాయకులతో కలిసి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆవిష్కరించారు.