సిరిసిల్ల వైద్య ఆరోగ్య శాఖపై రివ్యూ
NEWS Oct 04,2024 11:25 am
జిల్లా పరిధిలోని ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా మెరుగైన వైద్యం అందేలా పటిష్ట కార్యాచరణను అమలు చేయాలని ఆరోగ్యశాఖ సంచాలకులు ఆర్వీ కర్ణన్ అన్నారు. ఆరోగ్యశాఖ సంచాలకులు ఆర్వీ కర్ణన్ జిల్లా సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, అదనపు కలెక్టర్లతో కలిసి సిరిసిల్ల వైద్య ఆరోగ్య శాఖ పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులలో అత్యధికంగా ప్రసవాలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.