అఖిల్ స్ట్రాంగ్ రియాక్షన్
NEWS Oct 04,2024 08:59 am
అక్కినేని అఖిల్ మంత్రి కొండా సురేఖపై చేసిన ట్వీట్ చర్చనీయంశమవుతోంది. కొండా సురేఖ చేసిన నిరాధారమైన, హాస్యాస్పదమైన ప్రకటనలు అసభ్యకరంగా, జుగుప్సాకరంగా ఉన్నాయని అఖిల్ మండిపడ్డారు. ప్రజా సేవకురాలిగా ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఆమె ప్రవర్తించిన తీరు సిగ్గుచేటు, క్షమించరానిదని, సమాజంలో ఆమెలాంటి వాళ్లకు , మన్నన లేదన్నాడు.