జెఫ్ బెజోస్‌ను వెనక్కి నెట్టిన జుకర్ బర్గ్
NEWS Oct 04,2024 08:22 am
మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. జెఫ్ బెజోస్‌ను దాటేశాడు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం జుకర్‌బర్గ్ సంపద 206 బిలియన్ డాలర్లు. అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ సంపద 205 బిలియన్ డాలర్లు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ 256 బిలియన్ డాలర్లతో అగ్ర స్థానం. ముకేశ్ అంబానీ 107 బిలియన్ డాలర్ల సంపదతో 14వ స్థానం, 100 బిలియన్ డాలర్లతో గౌతమ్ అదానీ 17వ స్థానంలో ఉన్నారు.