సుప్రీంకోర్టు తీర్పుతో మా డిమాండ్‌కు విశ్వసనీయత పెరిగింది
NEWS Oct 04,2024 08:11 am
శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును ఆహ్వానిస్తున్నట్టు మాజీ మంత్రి రోజా అన్నారు. స్వతంత్ర సంస్థతో విచారణ జరగాలన్న మా డిమాండ్‌కు సుప్రీం తీర్పుతో విశ్వసనీయత పెరిగింది. సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ విచారణతో నిజాలు వెలుగులోకి వస్తాయి. గాయపడిన కోట్లాది మంది భక్తుల మనోభావాలు పునరుద్ధరించినట్టు అవుతుందని తిరుపతి ఆడబిడ్డగా నమ్ముతున్నా అంటూ రోజా ఎక్స్‌లో పోస్టు చేశారు.