సుప్రీంకోర్టు తీర్పు.. చంద్రబాబుకు చెంపపెట్టు..!
NEWS Oct 04,2024 07:57 am
తిరుమలలో లడ్డూ కల్తీ వ్యవహారంపై సీబీఐ ఆధ్వర్యంలో సిట్ బృందం విచారణ జరపాలన్న సుప్రీంకోర్టు తీర్పును టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్వాగతించారు. లడ్డూ కల్తీపై చంద్రబాబు దురుద్దేశ పూర్వకంగానే ఆరోపణలు చేశారు. ఆ స్వామి ఆదేశాలతోనే ఈ తరహా తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చిందని.. సీబీఐ విచారణ ద్వారా నిజాలు బయటకు వస్తాయని భూమన ఆశాభావం వ్యక్తం చేశారు.