సీబీఐ విచారణకు సుప్రీం ఆదేశాలు
NEWS Oct 04,2024 06:07 am
ఢిల్లీ: తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ ఆరోపణలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. లడ్డూ కల్తీ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. CBI పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో దర్యాప్తు జరగాలని స్పష్టం చేసింది. CBI నుంచి ఇద్దరు అధికారులను, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు అధికారులు, FSSAI నుంచి ఒకరితో దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.