నేడు తిరుమలకు సీఎం చంద్రబాబు
సతీసమేతంగా పట్టువస్త్రాల సమర్పణ
NEWS Oct 04,2024 05:05 am
తిరుమలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు సతీసమేతంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఈ సాయంత్రం తిరుమల చేరుకుని బేడి ఆంజనేయ స్వామి దర్శనం అనంతరం.. శ్రీవారి ఆలయానికి వెళ్లి స్వామికి పట్టువస్త్రాలు సమర్పించి రాత్రి తిరుమలలో బస చేస్తారు. శనివారం కొత్తగా నిర్మించిన వకుళామాత కేంద్రీకృత వంటశాల ప్రారంభిస్తారు.